సమిష్టిగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లామని అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ సూచించారు. అల్లవరం మండలం ఓడలరేవులో నిరసన దీక్ష చేస్తున్న శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించారు. గ్రామాభివృద్ధికి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న అంశంపై ముందుగా ఒక నిర్ణయానికి రావాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే ఆనందరావు, జిల్లా కలెక్టర్, తాను ముగ్గురం కలిపి ఓఎన్జీసీ ఉన్నతాధికారులతో గ్రామాభివృద్ధి అంశంపై చర్చిస్తామని ఎంపీ చెప్పారు.