అల్లవరం మండలం, ఓడలరేవు గ్రామస్థులు ఓఎన్జీసీ ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని దీక్షలను చేపట్టారు. అంతేకాకుండా గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షా శిబిరాన్ని శనివారం అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ సందర్శించారు. ఈ క్రమంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓఎన్జీసీ యాజమాన్యంతో చర్చించి గ్రామస్థుల డిమాండ్లను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు.