కామనగరువులో వేగంగా బ్రిడ్జి నిర్మాణ పనులు

61చూసినవారు
అమలాపురం మండలం కామనగరువు పరిధిలోని విత్తనాలవారిపాలెం పంట కాలువపై రూ 17 లక్షలతో నిర్మిస్తున్న వంతెన పనులు చురుగ్గా సాగుతున్నాయి. గణేశ్ నగర్ కాలనీ వాసులకు అమలాపురం, అరిగెలపాలెం వైపు వెళ్లేందుకు ఉపయోగపడే ఈ బ్రిడ్జిని ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్నారు. పిల్లర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరితగతిన ఈ వంతెనను అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్