అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లిలో రూ. 2 కోట్లతో నిర్మిస్తున్న వెంతెన నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో నూతన బ్రిడ్జికి స్లాబ్ వేయనున్నట్లు కాంట్రాక్టర్ ఆదివారం తెలిపారు. దీంతో గత కొంతకాలంగా అమలాపురం పట్టణాన్ని పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు. ఈ వంతెన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే రాకపోకలు సాగేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు.