పాఠశాలకు 150 స్టీల్ ప్లేట్లు వితరణ

78చూసినవారు
పాఠశాలకు 150 స్టీల్ ప్లేట్లు వితరణ
ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి రంగనాయకమ్మ జడ్పీ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు 150 స్టీల్ ప్లేట్స్‌ను దాతలు అందించారు. గ్రామానికి చెందిన జగదీష్ నాయుడు తన తండ్రి వెంకటేశ్వరరావు, సోదరుడు చంద్రశేఖర్ జ్ఞాపకార్థం వీటిని శనివారం అందజేశారు. ఈ మేరకు ఉపాధ్యాయులు సత్యనారాయణ దాత దంపతులను దుశ్శాలువాతో సత్కరించారు. ఎంపీటీసీ నాగరత్నకుమారి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్