రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కె. గంగవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు చిర్రా రాజకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన సభ్యత్వ కిట్లను పంపిణీ చేశారు. గంగవరం, సుందరపల్లి, ఊడిమూడి, తమ్మాయపాలెం, కూళ్ళ, మల్లవరం, కోటిపల్లి గ్రామాలలో క్రియాశీలక సభ్యత్వం కిట్లను కార్యకర్తలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.