జూలై 11 నుంచి రైతుబజాల్లో బియ్యం, కందిపప్పు

51చూసినవారు
జూలై 11 నుంచి రైతుబజాల్లో బియ్యం, కందిపప్పు
బహిరంగ మార్కెట్లో బియ్యం, కందిపప్పు ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వాటి ధరలను తగ్గించి రైతు బజార్లలో ఈనెల 11 నుంచి వినియోగదారులకు అందించనున్నట్లు అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఆమె అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్