గొల్లపాలెం: విషవాయువు లీకవకుండా చర్యలు

73చూసినవారు
గొల్లపాలెంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం పర్యటించారు. హైడ్రోజన్ సల్ఫైడ్ లీకేజీ తో 10 మంది అస్వస్థతకు గురైన వారిని పరామర్శించారు. సంఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ఓఎన్జిసి తరఫున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జీజీఎస్ అధికారులను ఆదేశించారు. స్థానికంగా హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్