అమలాపురంలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ కాసి, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈదురు గాలులతో కుండ పోత వర్షం పడింది. అమలాపురం పట్టణం, రూరల్ మండలంలోని కామనగరువు, వన్నెచింతలపూడి తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. కళ్లాల్లో ఆరబోసుకున్న ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆందోళన చెందారు.