తుఫాన్ కారణంగా అమలాపురం పట్టణంలో శనివారం ఉదయం నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుంది. ఆఫీసులకు, కాలేజీలకి వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తుఫాన్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కలెక్టర్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.