వైసీపీ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధిగా కాశీ రామకృష్ణ నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై నిరంతరం పోరాటం చేస్తానని ఆయన శనివారం వివరించారు. తన నియామకానికి కృతజ్ఞతగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీశ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.