కోనసీమ జిల్లాలోని అన్ని మండలాల్లో బుధవారం దఫదఫాలుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎస్ఈ సిద్ధిలరాజబాబు మంగళవారం తెలిపారు. విద్యుత్ టవర్ల నిర్మాణ పనుల నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రాంతాన్ని బట్టి విద్యుత్ కోతలు ఉంటాయన్నారు. అమలాపురం, కొత్తపేట, రాజోలు, ముమ్మిడివరం సహా పలు మండలాలకు ఈ అంతరాయం వర్తిస్తుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.