విపస్యాన ధ్యాన పద్ధతి పని ఒత్తిడిని తగ్గించి మనశ్శాంతిని పొందేందుకు ఎంతో ఉపయుక్తమని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం అమలాపురం కలెక్టరేట్ వద్ద ఎంఈఓలు, హెచ్ఎంలతో విపస్యాన ధ్యానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాలల్లో వయస్సు ఆధారంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.