అమలాపురం రూరల్ మండలం పేరూరు ఇందిరాకాలనీలో అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు చేతుల మీదుగా పెన్షన్ గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలక్షన్లో ఇచ్చిన హామీ ని నిలబెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి , అమలాపురం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రమేష్ పాల్గొన్నారు.