జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలోని గాంధీనగర్, గడియార స్తంభం సెంటర్లలో బుధవారం గాంధీజీ విగ్రహాలకు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గాంధీజీ ఆశయాలు సాధనకు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.