గాంధీ జయంతి సందర్భంగా తాళ్లరేవు మండలంలోని చొల్లంగిపేటలో ఉన్న బి. ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 'స్వచ్ఛత హీ సేవా' కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని విద్యార్థులతో కలిసి, పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మ గాంధీజీ ఆదర్శాలను పాటిస్తూ, సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.