భారీ వర్షాల నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయక చర్యలను అందించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి ఆయన జిల్లాలోని అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో 3 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో నిత్యం ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.