అల్లవరం మండలం బోడసకుర్రులో గోదావరి వరద పరిస్థితిని అధికారులు ఆదివారం సమీక్షించారు. గ్రామంలోని మత్స్యకార ప్రాంతం ముంపు బారిన పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు గ్రామంలో పర్యటించారు. పుష్కరాల రేవులో వరద పరిస్థితిని ఆదివారం పరిశీలించారు.