అమలాపురం మండలంలో 12, 302 మందికి పింఛన్లు

75చూసినవారు
అమలాపురం మండలంలో 12, 302 మందికి పింఛన్లు
అమలాపురం మండలంలో జులై నెలకు సంబంధించి 12, 302 మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసిందని మండల పరిషత్ అధికారులు శనివారం తెలిపారు. ఈ మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో లబ్ధిదారులకు జులై 1వ తేదీన గ్రామ సచివాలయ, రెవెన్యూ సిబ్బంది పింఛన్లను అందిస్తారని తెలిపారు. గ్రామాలలో లబ్ధిదారులంతా సిబ్బందికి అందుబాటులో ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్