ప్రతి లబ్ధిదారుడికి సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఇంటి వద్దే పెన్షన్లు అందించాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఇతర అధికారులతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. పంపిణీలో ఎటువంటి సమస్యలు ఏర్పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.