వినాయక చవితి ఉత్సవాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అల్లవరం ఎస్సై హరీశ్ కుమార్ బుధవారం తెలిపారు. విగ్రహాల ఏర్పాటు, విద్యుత్, మైక్ పర్మిషన్లు ఎప్పటిలాగే ముందుగా అనుమతులు కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో ఆలయ కమిటీ నిర్వాహకులు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బలవంతంగా చందాలు వసూలు చేయరాదన్నారు.