అమలాపురం శేఖర్ థియేటర్ లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ హీరో ప్రదీప్ మాచిరాజు, హీరోయిన్ దీపిక పిల్లి, చిత్ర డైరెక్టర్ నితిన్ , భరత్, చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ తన సొంతూరైన అమలాపురం రావడం అందరిని కలవడం ఎంతో ఆనందంగా ఉందని, సినిమా ఆదరించి హిట్ చేసినందుకు ప్రేక్షకులకు , ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో థియేటర్ యాజమాన్యం, అభిమానులు పాల్గొన్నారు.