అమలాపురం మున్సి పల్ వైస్ ఛైర్మన్ పదవితో పాటు కౌన్సిలర్ స్థానానికి రాజీనామా చేసినట్లు తిక్కిరెడ్డి వెంకటేష్ మంగళవారం తెలిపారు. పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణికి రాజీనామా లేఖ అందజేశారు. కొంతకాలంగా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని, వార్డు ప్రజలకు సేవలు అందించ లేకపోతున్నానని పేర్కొన్నారు. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ తరపున కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు.