ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాం వద్ద మంగళవారం విషాదం చోటు చేసుకుంది. బీచ్ లో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. అయినవిల్లి మండలం నేదునూరుకు చెందిన మరొక యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.