డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారిగా (డీఈఓ)గా షేక్ సయ్యద్ సలీం బాషాను నియమించారు. గుంటూరు జిల్లా నుంచి బదిలీపై ఆయన కోనసీమ జిల్లాకు వస్తున్నారు. ప్రభుత్వం డీఈఓలను బదిలీ చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా గుంటూరు డీఈఓ షేక్ సయ్యద్ సలీం బాషాను కోనసీమ జిల్లా డీఈఓగా బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.