అమలాపురం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కల్వకొలను తాతాజీ పార్టీ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షడు కొండేటి చిట్టిబాబు, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డికి పంపారు. ఇప్పటికే ఆయన జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. అందువల్లే రాజీనామా చేశారని ఆయన అనుచరులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.