జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గోదావరి, ప్రాణహిత నదులతో అంతర్ వాహినిగా సరస్వతీ నది కలిసే త్రివేణి సంగమంలో ఈ పుష్కరాలు జరగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ, అమలాపురం నుంచి సూపర్ లగ్జరీ, ఇంద్ర ఏసీ సర్వీసులను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 25వ తేదీ వరకూ ఈ బస్సులను నడపనునున్నారు.