మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీఎస్పీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పొలమూరి మోహన్ బాబు డిమాండ్ చేశారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం రావులచెరువు ప్రాంతంలో గత సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పటల్లో చికిత్స పొందుతున్న గొవ్వాల నాగలక్ష్మి శుక్రవారం మృతి చెందింది. బీఎస్పీ నాయకులు ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి సంతాపాన్ని తెలియజేశారు.