రైల్వే లైన్ వల్ల ఆలయానికి ముప్పు

71చూసినవారు
రైల్వే లైన్ వల్ల ఆలయానికి ముప్పు
అమలాపురం మండలంలోని రోళ్లపాలెం గ్రామంలో ఉన్న అమలేశ్వర స్వామి ఆలయానికి ముప్పు వాటిల్లే విధంగా కోనసీమ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టవద్దని విశ్వహిందూ పరిషత్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం కోరారు. విశ్వహిందూ పరిషత్ నాయకులతో కలిసి అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో ఏవో భాస్కర్ కు బుధవారం ఈ సమస్యపై వినతి పత్రాన్ని అందజేశారు. అమలేశ్వర స్వామి ఆలయ విశిష్టతను ఆయనకు వివరించారు.

సంబంధిత పోస్ట్