విజయవాడలోని వరద బాధితులను మానవతార దృక్పథంతో ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ కోరారు. అమలాపురానికి చెందిన మట్టపర్తి శ్రీరాములు అనే దస్తావేజుల లేఖరి అతని కుమార్తె లక్ష్మీ కార్తీక సౌందర్య కోరిక మేరకు రూ. 20, 000 ఆర్థిక సహాయాన్ని విజయవాడ వరదబాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఈ చెక్కును కలెక్టర్ కు వారు ఆయన కార్యాలయంలో బుధవారం అందజేశారు.