ఉప్పలగుప్తం మండలం పరిధిలోని గొల్లవిల్లి పంచాయతీ పరిధి వాడపర్రుకు చెందిన యువకుడు కె. సురేష్ (25) ను మద్యం అలవాటు మానుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపంతో ఈ నెల 7న పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీహెచ్ రాజేష్ తెలిపారు.