కోనసీమలో చమురు సంస్థల అన్వేషణ కోసం సర్వే చేస్తున్న కంపెనీలు కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని, కనీస వేతనాలు భద్రత కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఓఎన్జీసి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాళ్ల బాజ్జి ఆరోపించారు. ఉప్పలగుప్తం అంబేడ్కర్ భవన్ లో నేషనల్ ఓఎన్జీసీ వర్కర్స్ యూనియన్ ప్రథమ వార్షికోత్సవ సమావేశం బుధవారం నిర్వహించారు. ఓఎన్జీసీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలన్నారు.