ఉప్పలగుప్తం: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

64చూసినవారు
ఉప్పలగుప్తం: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఉప్పలగుప్తం మండలం పరిధిలోని పలు గ్రామాలకు శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లుగా అమలాపురం డివిజన్ ఈఈ రాంబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీడర్ పనుల నిమిత్తం ఉప్పలగుప్తం, పేరాయిచెరువు, జగ్గరాజుపేట, గొల్ల విల్లి, వాడపర్రు, కూనవరం, కిత్తనచెరువు, చీకట్ల పాలెం, సన్నవిల్లి, సూధాపాలెం తదితర గ్రామాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్