అమలాపురం మండలంలోని భట్నవిల్లి గ్రామంలో ఆదివారం 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని మాట్లాడుతూ. అర్హత కలిగిన పేదలందరికీ కూటమి ప్రభుత్వం సకాలంలో సంక్షేమ పథకాలను అందిస్తూ వందరోజుల పాలన పూర్తి చేసుకుందన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని అన్నారు.