బిక్కవోలు మండలం ఆరిక రేవుల గ్రామంలో గోగులమ్మ, గొల్లలమ్మ అమ్మవార్ల జాతర తీర్థ మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని అమ్మ వారిని దర్శించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి పూజలు అనంతరం ఘనంగా సత్కరించారు.