గుర్తు తెలియని మృతదేహం లభ్యం

70చూసినవారు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
అనపర్తి శివారు కొత్తూరు వంతెన వద్ద ఎర్ర కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని ఎస్సై హనుమంతరావు మంగళవారం తెలిపారు. ఎర్ర కాలువలో కుళ్లిన స్థితిలో పురుషుడి మృతదేహం కొట్టుకు వచ్చిందన్నారు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుందని, నీలం రంగు చొక్కా, నలుపు ప్యాంటు ధరించాడన్నారు. మృతుడు 5.30 అడుగుల ఎత్తు ఉన్నాడని చెప్పారు. వీఆర్వో రవికుమార్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్