అనపర్తి: చలివేంద్రాలు ఏర్పాటు అభినందనీయం

62చూసినవారు
అనపర్తి మండలం కుతుకులూరులో శంఖు చక్రధర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్