అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం సంతాపం తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలనుకున్నామని, అయితే ఈ విషాద ఘటన నేపథ్యంలో ఆ కార్యక్రమాలను వాయిదా వేసినట్టు తెలిపారు.