పులగుర్తలో భేటీ బచావో బేటి పడావో

83చూసినవారు
పులగుర్తలో భేటీ బచావో బేటి పడావో
అనపర్తి మండలం పులగుర్తలో శుక్రవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని బాలికలకు బాలికల చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టాలు, బాలికల హక్కులను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ రమణంజలి, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్