అనపర్తి మండలం కొప్పవరం గ్రామ సర్పంచ్ కర్రి బుల్లి మోహన్ రెడ్డి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రామకృష్ణారెడ్డిని కలిసి తన తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుల్లి మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.