మట్టి గణపతి విగ్రహాలను పూజించాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి

65చూసినవారు
పర్యావరణ హితం కోసం వినాయక చవితి వేడుకలలో భక్తులందరూ మట్టి గణపతి విగ్రహాలను మాత్రమే పూజించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయనను అనపర్తి మండలంలోని రామవరం క్యాంప్ కార్యాలయం వద్ద విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిసి మట్టి గణపతి విగ్రహాన్ని ఆయనకు అందజేసి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చేస్తున్న ప్రచార కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్