అనపర్తి: ఘనంగా ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు

71చూసినవారు
అనపర్తి లో అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని వారోత్సవాలను ప్రారంభించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి అగ్ని ప్రమాదాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్