అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆహార కమిషన్ సభ్యులు

72చూసినవారు
అనపర్తిలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు గురువారం పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, రేషన్ దుకాణాలు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ప్రధాన మంత్రి మాతృ వందన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాలింతలకు, గర్భిణులకు సూచించారు. రోగులకు పంపిణీ చేసే భోజనాన్ని పరిశీలించి, లోటుపాట్లు సరిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్