పెదపూడి మండలంలోని 18 గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆరోపణలున్నాయి. ఈ మేరకు దళిత సంఘాల కన్వీనర్ గుబ్బల ఆదినారాయణ శుక్రవారం ఆరోపించారు. రెవెన్యూ, పోలీస్, గనుల శాఖల వైఫల్యమే ఇందుకు కారణమని ఆయన విమర్శించారు. అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై తక్షణమే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.