సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో చర్యలు చేపట్టాలని ఎంపీడీవో హిమ మహేశ్వరి అన్నారు. అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో మండల అధికారులు గురువారం సమావేశం అయ్యారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గ్రామాల్లో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు.