అనపర్తి నుంచి విజయవాడ వరద బాధితులకు భోజన ప్యాకెట్లను బుధవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. పొలమూరు బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్, బలభద్రపురం ఆంధ్ర శిరిడి సాయి మందిరం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల సౌజన్యంతో ఏర్పాటు చేసిన 9000 భోజన ప్యాకెట్లను మూడు వ్యాన్లపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జెండా ఊపి విజయవాడ తరలించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.