పెదపూడి లో శనివారం సాయంత్రం రైతులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాయితీపై పవర్ టిల్లర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ఇబ్బందులు తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.