సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు నూతనంగా నిర్మించిన గ్రంధాలయం భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.