అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని రంగంపేటలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం రాత్రి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దీపాలు వెలిగించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద దీపాలు వెలిగిస్తున్నామన్నారు.