అనపర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటించనున్నారని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. రామవరం, అనపర్తి, పందలపాక, గొల్లల మామిడాడ గ్రామాల్లో పింఛన్ పంపిణీ చేయనున్నారని, రంగంపేట పీహెచ్సీలో స్టాఫ్ డయేరియా క్యాంపైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని పొలమూరులో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారని, ఊలపల్లి బాధితులను పరామర్శిస్తారన్నారు.